చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు దాడులు ముమ్మరం చేసారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బిజాపూర్ జిల్లాలో సరిహద్దు భద్రతాసిబ్బందిపై దాడి చేసారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులను ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బిజాపూర్లోని ఘట్టి ప్రాంతంలో భద్రతాసిబ్బంది వాహనం లక్ష్యంగా మావోయిసట్లు ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు, ఒక డీఆర్జీ, ఓ పౌరుడు గాయపడ్డారు. క్షతగాత్రులను బిజాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే ఛత్తీస్గఢ్లో తొలి దశ పోలింగ్ జరిగింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే 18 నియోజకవర్గాల్లో నవంబరు 12న పోలింగ్ నిర్వహించారు. ఇందులో బిజాపూర్ కూడా ఉంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అందుకు పోస్టర్లు, కరపత్రాలు పంచారు. అయినా, భారీ బందోబస్తు నడుమ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక మిగతా 72 నియోజకవర్గాలకు నవంబరు 20న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.