50 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా
తెలుసుకొవలసిన విషయాలు....
50 సంవత్సరాలు దాటినవారు చదివి ఆలోచించి ఆచరణ యోగ్యం అనుకుంటే రాబోయే జీవితానికి పనికి వస్తుందని ఆశిద్దాము..పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అప్పట్లో రాసారు ఇప్పుడు సుఖమయమైన వృధ్ధాప్యం కోసం పదిహేను పంక్తులు మీకోసం .
ఈ క్రింద సూత్రాలు ఆచరించి ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోండి..
1. మీ సొంతఊరిలో, సొంతగడ్డ పై నివసించండి...స్వతంత్రంగా జీవించడంలోగల ఆనందాన్ని పొందండి!
2. మీ బ్యాంకుబాలెన్స్ & స్థిరాస్థులు మీ పేరు మీదే ఉంచుకోండి.. అతిప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి!
3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు. ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు!
4. మీ శ్రేయస్సుకోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి!
5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చేదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి!
6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.మీరు మీ తరహాలో జీవించండి!
7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలనో లేదా వయసు కారణంగా ఎదుటివారు గౌరవం ఇవ్వాలనో ఆశించకండి!
8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ సొంతఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి!
9. ప్రార్ధించండి కాని అది భిక్షమెత్తుకుంటున్నట్టు కాదు, చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి!
10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి. పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు సహజమే!
11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి!
12. ప్రతి సంవత్సరం వీలుంటే ఇతరులతో కలిసి చిన్నటూరుకు వెళ్ళిరండి. దీనివలన జీవితంపట్ల మీ దృష్టికోణం మారుతుంది!
13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోండి. ఒత్తిడిలేని జీవితాన్ని గడపండి!
14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి!
15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడమని గ్రహించండి!
50 సంవత్సరాలు దాటినవారు చదివి ఆలోచించి ఆచరణ యోగ్యం అనుకుంటే రాబోయే జీవితానికి పనికి వస్తుందని ఆశిద్దాము..