YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దివ్యాంగుల సంక్షేమానికి 121 కోట్లు

దివ్యాంగుల సంక్షేమానికి 121 కోట్లు
నెల్లూరు జిల్లాలో 34,724 మంది దివ్యాంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెలా పింఛన్ అందజేస్తున్నాం. కృత్రిమ అవయవాల కోసం గత ఏడాది రూ.13 కోట్లు, ఈ ఏడాది 35 కోట్లు వెచ్చిస్తున్నాం. 2018-19లో దివ్యాంగుల సంక్షేమానికి రూ.121 కోట్లు కేటాయించాం. పద్దెనిమిదేళ్లు నిండిన బధిరులకు స్మార్ట్ ఫోన్, డిగ్రీ, ఆ పై చదువులు చదివే వారికి ల్యాప్ టాపులు, అంధులకు బ్రెయిలీ లిపి పలకలు, 50 ఏళ్ల లోపు దివ్యాంగులకు రూ.37 వేలు విలువైన బ్యాటరీ ట్రై సైకిల్ రూ.12 వేలకే పంపిణీ చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. బుధవారం వెంకటాచలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని అయన ప్రారంభించారు.  మంత్రి దివ్యాంగులందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలి.. డిసెంబరులో పరికరాలు, కృత్రిమ అవయవాల పంపిణీ జరుగుతుంది..వీలైనంత వరకు జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న పంపిణీ చేస్తామని అన్నారు. 

Related Posts