YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నల్లధనం, నోట్ల రద్దు ఏవిధమైన పోరాటం చేసిందో చెప్పాలి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్

నల్లధనం, నోట్ల రద్దు ఏవిధమైన పోరాటం చేసిందో చెప్పాలి            కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్
ప్రధాని నరేంద్ర మోదీ,చత్తీస్ ఘడ్ లోని రమణ్‌సింగ్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 15ఏళ్ల పాటు పాలనతో భాజపా రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. నల్లధనంపై నోట్ల రద్దు ఏవిధమైన పోరాటం చేసిందో చెప్పాల్సిందిగా ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న రెండో రోజు పర్యటనలో భాగంగా కోర్బా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.‘నల్లధనంపై నోట్ల రద్దు ఏ విధమైన పోరాటం చేసింది. రోజువారీ కూలీలు, మహిళల తాము ఎంతో కష్టపడి సంపాదించుకున్న నగదును బ్యాంకుల ఎదుట క్యూలో వేచి ఉండి డిపాజిట్లు చేశారు. నల్లధనం కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా క్యూలో నిలబడి ఉండటం మీరు చూశారా? నోట్ల రద్దు తర్వాత నీరవ్‌ మోదీ ప్రజలకు చెందిన వేల కోట్లతో పారిపోయాడు. విజయ్‌ మాల్యా లండన్‌ పారిపోయే ముందు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకున్నాడు. కానీ వాళ్లను ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం’ అని రాహుల్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో 15ఏళ్ల పాటు అధికారంలో ఉండి రమణ్‌సింగ్‌ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం చేసిందేమి లేదని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లాభపడే విధంగా చర్యలు చేపట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Related Posts