YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

మరో డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు

మరో డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు

- పోరాటానికి చేతులెత్తేసిన చంద్రబాబు 

- ఎంపీలతో  భేటీలో ముఖ్యమంత్రి నిర్ణయం 

విభజన హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో డ్రామాకు తెరలేపారు. ప్రత్యేక హోదాను గాలికొదిలేసేవిధంగా మరోసారి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న నిధుల విషయంలో బీజేపీ ఎంపీలు చెప్పిన లెక్కలపై ఈ భేటీలో ప్రధానంగా సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా   కేంద్ర నిధులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీలపై దృష్టి సారించారు. వాస్తవంగా నిధులు చెప్పి హరిబాబుకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీలతో భేటీ అనంతరం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏకాంత భేటీ కానున్నారు.

కేంద్ర నిధులు, హామీలపై చంద్రబాబుతో సుజనా చౌదరి చర్చించారు. ప్రత్యేక హోదాను గాలికొదిలేసి.. నిధుల విషయంలో కేంద్రం నుంచి సానుకూలత వచ్చిందని ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించినట్టు సమాచారం. మరో 15 రోజుల్లో రాష్ట్రానికి అన్నీ ఇచ్చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రచారాన్ని ఎత్తుకోబోతున్నట్టు తెలుస్తోంది.విభజన హామీల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నాలుగు రోజులు పార్లమెంటులో హడావిడి చేసిన టీడీపీ నేతలు..  ఆ తర్వాత ఈ విషయంపై నోరు మెదపని సంగతి తెలిసిందే. రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చేవిధంగా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అన్ని వచ్చేస్తున్నాయంటూ టీడీపీ నేతలు లీకులు వదులుతున్నారు. మరోవైపు ఏపీకి చేసిన సాయంపై లెక్కలతో బీజేపీ నేతలు వివరించడం టీడీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. బీజేపీ నేతలు చెప్పిన లెక్కలపై ఏం సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజధాని బిల్లుల దారిమళ్లింపు, పోలవరం కాంట్రాక్ట్‌ విషయంలో టీడీపీ ఇరుకునపడింది. దీంతో కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా.. పోరాటాన్ని వదిలేసి.. చేతులెత్తేయాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts