ఐఏపీలో విపక్షాలతో చర్చించకుండానే భూసేకరణ 2018 చట్టం తీసుకువచ్చారు రైతుల పొట్టకొట్టే ఈ జిఓ 562 ను తక్షణం ఉపసంహరించుకోవాలి. -చంద్రబాబు రైతు వ్యతిరేకి అనే విషయం ఈ చట్టంతో స్పష్టమైంది. ఈ రాష్ర్టానికి రాజధాని లేదు.మేం కట్టిస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొందని వైకాపా నేత, ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్దంతో ల్యాండ్ పూలింగ్ తీసుకువచ్చారు. చంద్రబాబు నీలాగా నీకొడుకు లాగా రైతులు పార్క్ హయ్యత్ హోటల్ లో ఉండరు. ఆ హోటల్ లో నీ కుటంబం కోసం రాష్ర్ట ప్రజల కష్టార్జితాన్ని బిల్లుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపించారు. రైతు,రైతు కూలీలకు వ్యతిరేకంగా పనిచేయాలనే చంద్రబాబు ఉద్దేశ్యం. రైతుల భూములు లాక్కోవాలనే దుర్మార్గమైన ఆలోచన తప్ప మరోటి లేదు. కేంద్రం భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలంటే గ్రామసభ ఆమోదం,రైతులతో చర్చలు, ఆహారభద్రత,రైతుకూలీల ఉపాధి వంటి వాటి గురించి చూడాలి.కాని చంద్రబాబు ప్రభుత్వం చట్టం ప్రకారం పైన పేర్కొన్న వాటిని గురించి ఆలోచించకుండానే రైతులనుంచి భూములు తీసుకోవచ్చు. పైగా కనీసం కోర్టులకు కూడా వెళ్లకూడదనే నిభందన సైతం పెట్టారు. -భూసేకరణ సెటిల్ మెంట్ లన్నీ కూడా కలెక్టర్ ద్వారా జరుగుతాయని అంటున్నారు. ఈ చట్టం ద్వారా కలెక్టర్ వ్యవస్దలను కూడా భ్రష్టు పట్టించేలా పరిస్దితులు రాబోతున్నాయని ఇఅయన విమర్శించారు. కలెక్టర్ ల వ్యవస్దను దళారి వ్యవస్దగా మారుస్తున్నావు. ఈ జిఓ 562 ద్వారా భూమి కావాలని దరఖాస్తు చేసుకంటే అవి మూడు పంటలకంటే అదికంగా పండుతున్నా సరే తీసుకోవచ్చు. అంటే భూములపై ప్రైవేటు కంపెనీల కన్ను పడితే చాలు కలెక్టర్ ను ఉపయోగించి యధేచ్చగా తీసుకోవచ్చు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారు ఇలాంటి చట్టాలు తెచ్చారు. రాజధానిలో 500 ఎకరాలు సరిపోతుందనుకుంటే లక్షా ఆరువేల ఎకరాలు లాక్కున్నావు. పొలాలు తగులబెట్టించి భయపెట్టి,బెదిరించి 33 వేల ఎకరాలు తీసుకున్నావు. కాని అన్ని ఎకరాలు తీసుకుని ఏమైనా నిర్మించావా అంటే అదీ లేదు.ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. నాలుగునెలల్లో ఎటూ నువ్వు అదికారం కోల్పోబోతున్నావు. రాబోయేది జగన్ ప్రభుత్వమని అన్నారు.