ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిఎస్ఎటి-29 ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి ఎంకె III-డి 2 ప్రయోగం సఫలం కావడం పట్ల ఇస్రో (ఐఎస్ఆర్ఒ) శాస్త్రవేత్తల కు అభినందనలు తెలిపారు. “జిఎస్ఎటి-29 ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి ఎంకె III-డి2 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు మన శాస్త్రవేత్తల కు ఇవే నా హృదయ పూర్వక అభినందనలు. ఈ ద్వంద్వ సాఫల్యం అత్యంత భారీ ఉపగ్రహాన్ని ఒక భారతీయ వాహక నౌక ద్వారా కక్ష్య లోకి ప్రవేశ పెట్టడం లో ఒక నూతనమైన రికార్డు ను నెలకొల్పడమైంది. ఈ ఉపగ్రహం మన దేశం లోని సుదూర ప్రాంతాల కు కూడా కమ్యూనికేశన్ ను, ఇంటర్ నెట్ సేవల ను అందించగలుగుతుందని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.