YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పాత నోట్ల లెక్కలు ఇంకా తేలలేదు..

పాత నోట్ల లెక్కలు ఇంకా తేలలేదు..

పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు తిరిగి వచ్చిన పాత నోట్ల లెక్కలు ఇంకా తేలలేదు. పెద్ద నోట్లు రద్దైన 15 నెలల తర్వాత కూడా వీటి లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచార హక్కు చట్టం కింది ఓ పిటిషనర్‌కు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది. ఎప్పటిలోగా లెక్కింపు పూర్తి అవుతుందన్న పిటిషనర్‌ ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం ఇవ్వలేదు. మొత్తం 59 సీవీపీఎస్‌ యంత్రాలతో లెక్కింపు కొనసాగుతున్నట్టు సమాచారం ఇచ్చింది. గత ఏడాది జూన్‌ 30 నాటికి 15.28 లక్షల కోట్ల రూపాయల రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నోట్లు రద్దు నాటికి 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 

Related Posts