హిందువుల పార్టీ కాదని బిజెపికి పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్. బిజెపితో పవన్ లాలూచికి నిదర్శనం. హిందువుల పార్టీ కాదన్న బిజెపితో కలుస్తానని పవన్ ఎందుకని చెప్పలేదు..? లేదా బిజెపితో కలవనని ఎందుకని స్పష్టత ఇవ్వలేదు. జాతీయ స్థాయిలో తన వైఖరిని పవన్ ఎందుకని చెప్పలేరని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బిజెపితో పవన్ సంబంధాలపై స్పష్టత లేదు. నేరుగా సమాధానం ఇవ్వడంలేదు. బిజెపిని పవన్ వెనకేసుకుని వస్తున్నారు. ప్రధాని మోదిని విమర్శించే ధైర్యం జగన్, పవన్ కు లేదు. కేంద్రాన్ని నిధులు అడిగే ధైర్యం లేదు. పోలవరంకు నిధులు ఇవ్వకపోతే వీళ్లెందుకు నిలదీయరు? రాజధానికి నిధులు ఇవ్వని కేంద్రాన్ని ఎందుకని ప్రశ్నించరు..? కడప స్టీల్ పై, విశాఖ రైల్వే జోన్ పై ఎందుకని నోరు తెరవరు..? పునర్విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేసే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. కోడికత్తిపై ఫిర్యాదు ఇవ్వడం బాధితుడిగా జగన్ బాధ్యత. ఫిర్యాదు లేకుండా పంపేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. 19రోజులైనా దానిపై జగన్ నోరు తెరవలేదు. మరి దీనిపై రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారు? థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఎలా డిమాండ్ చేస్తారు? విశాఖలో ఫిర్యాదు లేకుండా ఢిల్లీవెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదా..? ‘నలుగురూ నవ్విపోదురు మాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది వైకాపా నేతల వ్యవహారం. కనీస బాధ్యత మరిచి ఢిల్లీలో అల్లరి చేస్తారా? రాష్ట్రానికి అప్రదిష్ట తేవడమే పనిగా పెట్టుకున్నారాఅని నిలదీసారు. చంద్రబాబు ధైర్యం గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబుకున్న ధైర్యం ఏమిటో దేశం మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసుకోవాల్సిన పనిలేదు. జగన్ ధైర్యంపై పవన్ ప్రశ్నిస్తే వైకాపా నోరు తెరవదు. అసెంబ్లీకి జగన్ గైర్హాజరును పవన్ ప్రశ్నిస్తే వైకాపా మౌనం. అక్కడే వైకాపా,జనసేన లాలూచి బైటపడింది. ఎవరి ఆదేశాల మేరకు పవన్ విమర్శలపై వైకాపా స్పందించడం లేదు. పవన్ పై విమర్శలు చేయవద్దని వైకాపాను మోది, షా శాసించారా అని నిలదీసారు. టిడిపికి వ్యతిరేకంగా బిజెపి కుట్రలు చేస్తోంది. జగన్,పవన్ బిజెపి కుట్రలో పాత్రధారులు అయ్యారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 3పార్టీల లాలూచికి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.