YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోడ్ల విషయంలో రైతులు ఇబంది..!!

 రోడ్ల విషయంలో రైతులు ఇబంది..!!

ఈ క్రింది లింకు రోడ్ల విషయంలో రైతులు మరియు గ్రామస్తులు కనీసం కాలినడక కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు

ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే విషయంలో..

1. కోడూరు మండలం లోని వీ. కొత్త పాలెం గ్రామ శివారులో  నాలుగవ నెంబరు కాలవ గట్టు వెంట ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.వర్షం  పడింది అంటే కనీసం నడవలేని పరిస్థితి.

ఈ రోడ్డుకిరువైపులా 1500 ఎకరాలలో వి కొత్తపాలెం మాచవరం, కొత్తపేట, తిప్ప పాలెం,  రామచంద్రపురం గ్రామాల్లో నివసించే రైతులు సాగు చేస్తున్నారు.

సీజన్లో సుమారు 800 మంది రైతులు,  కూలీలు ఈమధ్య రోడ్డుమీద రాకపోకలు సాగించాలి.

రోడ్డు సరిగా లేకపోవడం వలన కూలీలు కూడా రావడం లేదు. విత్తనాలు ఎరువులు, పండిన పంట రవాణా చేయాలంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

2. అదేవిధంగా కోడూరు మండలం లోని వేణుగోపాలపురం గ్రామం నుండి ఉల్లిపాలెం గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దారి చాలా గుంతలు పడి పోయింది.

సాలెంపాలెం నుండి వేణుగోపాలపురం వరకు అలాగే కోడూరు నుండి ఉల్లిపాలెం వరకు రోడ్డు వేసి మిగిలిన మధ్య లో ఉన్న మూడు కిలోమీటర్ల రోడ్డు వేయకుండా ఆపివేయడం జరిగింది.

మండల కేంద్రం కి వెళ్లాలంటే మా గ్రామస్తులు చుట్టూ తిరిగి విశ్వనాధపల్లి మీదుగా కోడూరు చేరుకోవాల్సి వస్తుంది.

ఈ రోడ్డు వేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న అయిదారు గ్రామాలకు మండల కేంద్రం కు అలాగే జిల్లా కేంద్రం కు ఉల్లిపాలెం భవానిపురం బ్రిడ్జి ద్వారా వెళ్ళటానికి  చాలా దగ్గర అవుతుంది.

ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి రైతులు కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు.

కావున పై రెండు రోడ్లను ముందు  తాత్కాలికంగా మరమ్మతులు చేయించి

శాశ్వత పరిష్కారం చూడాలి.

Related Posts