లెప్ట్ పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తారు.. రైట్ పార్టీలతో స్నేహానికి సిద్ధమంటారు... ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయరు... రాష్ట్రంలో మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు మద్దతిస్తారు... ఇంతకీ వైసీపీ అధినేత వైఖరేంటి..? జగన్ రెండు పడవల ప్రయాణం ఎంతవరకు సాగనుంది..?
రాష్ట్ర విభజన, కేంద్ర బడ్జెట్‌లో అన్యాయానికి వ్యతిరేకంగా ఏపీలోని అన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమాలు చేయపట్టింది. అయితే కేంద్రంపై పోరాటం విషయంలో జగన్ ఒక్క వైపు కమలంపార్టీతో సానుకూలదొరణతో వ్యవహరిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఆందోళన నిర్వహించడం.. చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై టీడీపీ నేతలు ఎన్డీయే లో బాగ్యాస్వామ్యలుగా ఉన్న అప్పటికి కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. మరివైపు వైసీపీ సైతం పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నా.. విభజన హామీలు అమలు కాకపోవటానికి టీడీపీ కారణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తుందే తప్ప.. కేంద్రాన్ని కాని ప్రధాని మోడిని కాని ఒక్క మాట కూడా అనడంలేదు. దీంతో కేంద్ర పై జగన్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ జగన్ చేస్తున్న కామెంట్ లు జగన్ బిజేపికి దగ్గిరయ్యేందుకు సంకేతాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయంపై నిర్వహించిన వామపక్షాలు బంద్‌కు వైసీపీ మద్దతు తెలపడంతో పాటు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా బంద్ లో పాల్గున్నారు. గతంలోనూ అనేక ప్రజా సమస్యలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన ఆందోళనలకు జగన్ పూర్తిగా మద్దతు ప్రకటించారు. అయితే జాతీయ స్థాయిలో పూర్తి వ్యతిరేకులుగా ఉన్న బీజేపీ, వామపక్షాలతో జగన్ రాష్ట్ర స్థాయిలో ఒకేసారి కలిసి పనిచెయ్యడంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో అవకాశాలు బట్టి బీజేపీతో లేదా వామపక్షాలతో పొత్తు దిశగా జగన్ ఇలాంటి విధానం అనుసరిస్తున్నారని పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే జగన్ ఇలా ద్విముఖవ్యూహంతో వెళుతున్నారని వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వామపక్షాల సపోర్టు కీలకమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎన్నికల అనంతరం కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీతో చెలిమి ఉపయోగపడతాయని వైసీపీ అధినాయకత్తం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ అనుసరిస్తున్న రెండు పడవల ప్రయాణం మొదటికే మోసం తెచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా రాజకీయవర్గాలనుంచి వస్తున్నాయి.