YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజస్థాన్ లో కుమ్ములాటలు బీజేపీలో టిక్కెట్ల గోల..కాంగ్రెస్ లో పదవుల గోల

రాజస్థాన్ లో కుమ్ములాటలు బీజేపీలో టిక్కెట్ల గోల..కాంగ్రెస్ లో పదవుల గోల
రాజస్థాన్ లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీలో టిక్కెట్ల గోల కొనసాగుతుండగా, కాంగ్రెస్ మాత్రం దూకుడుతో ముందుకు వెలుతుంది. ముఖ్యమంత్రి వసుంధరరాజేపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ముండు గెలుపే ధ్యేయంగా ఐక్యంగా పనిచేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు రెండు వర్గాలు విడిపోయి సీఎం కుర్చీకోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే రాహుల్ గాంధీ పైలట్ వైపే మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవం. దీంతో గెహ్లాట్ వర్గం ఒకింత అసంతృప్తితో ఉంది.టిక్కెట్ల కేటాయింపులో కూడా సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లకు సమాన ప్రాధాన్యత కల్పించింది అధిష్టానం. అలాగే తాజాగా ఇద్దరూ అసెంబ్లీ బరిలోకి దిగాలని ఆదేశించింది. అశోక్ గెహ్లాట్ గత కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని రాహుల్ భావించి పార్టీలో పదవి కూడా ఇచ్చారు. దీంతో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అశోక్ గెహ్లాట్ ను కూడా పోటీ చేయాలని ఆదేశించారు. ఆయన జోధ్ పూర్ ప్రాంతంలోని సర్దార్ పురా నుంచి నామినేషన్ త్వరలోనే వేయనున్నారు. సచిన్ పైలట్ ను కూడా పోటీ చేయమని రాహుల్ ఆదేశించారు. దీంతో మరోసారి సీఎం అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ఐక్యంగా పనిచేయడానికే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు బీజేపీలో ఇబ్బంది కర పరిస్థితులు నెలకొన్నాయి. వీరి మధ్య ఐక్యత కొరవడి పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా తయారైంది. ఎన్నికల సమయంలో ఏకంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేయడం సంచలనం కల్గించింది. దౌసా నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు హరీష్ మీనా ఎన్నికల వేళ బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈయన రాజస్థాన్ డీజీపీగా గతంలో పనిచేశారు. టిక్కెట్ల పంపిణీలో సరైన విధానాలను పాటించకపోవడం వల్లనే మీనా పార్టీని వీడినట్లు తెలుస్తోంది. వసుంధరరాజే నియంతృత్వ పోకడలతో వరుసగా పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించాక అనేకమంది పార్టీని వీడారు. బీజేపీ రాజస్థాన్ తొలి జాబితాగా 131 మంది అభ్యర్ధులను ప్రకటిచింది. ఇందులో 85 మంది సిట్టింగ్ లకు తిరిగి అవకాశం కల్పించింది. కొందరు మంత్రులకు కూడా జాబితాలో స్థానం దక్కలేదు. దీంతో వారంతా పార్టీని వీడుతున్నారు. మంత్రిగా పనిచేసిన సురేంద్ర గోయల్, ఎమ్మెల్యే హబీబుర్ రహ్మాన్ లు పార్టీని వీడారు. మరికొందరు మంత్రులు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారు. అయితేఎక్కువ స్థానాలను తమ బంధువులకే కేటాయించారన్న ఆరోపణలతో వరుసపెట్టి పార్టీని వీడుతున్నారు. మరి అసలే కష్టకాలంలో ఉన్న రాజస్థాన్ బీజేపీకి పార్టీని వరుసగా నేతలు వీడుతుండటంతో మరింత వీక్ అయ్యే అవకాశముందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Related Posts