చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పాలిస్తున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రావులపాలెంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలపూడి రామకృష్ణారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడాతూ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికార దాంతోపాటు భూదాహం కూడా పట్టుకుని అమరావతి, భోగాపురం, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు దోచుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులతోపాటు, ప్రజలకు కూడా శాంతిభద్రతలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమవడంతోపాటు, నరకాసుర పాలన తలపిస్తోందన్నారు.ప్రభుత్వ భూ కుంభకోణాలపై బిజెపి ఈ నెల 19 నుండి 24 వరకు పార్టీ నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి అడపా నాగేంద్ర, కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, నల్లా పవన్ , కర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు