తెలుగునాట..ఐదేళ్ళ క్రితం వరకు అగ్ర దర్శకులలో ఒకరిగా చలామణి అయ్యారు శ్రీను వైట్ల. ఆ సమయంలో.. ఆయనతో సినిమాలు చేయాలని నిర్మాతలు, హీరోలు తహతహలాడారు. కట్ చేస్తే.. ఇప్పుడు వరుస పరాజయాలు వచ్చేసరికి ఈ దర్శకుడి పేరు చెబితేనే అందరూ వెనకడుగేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ పూర్వ వైభవం కోసం మంచి కథను రాసుకుని...తన తొలి చిత్ర కథానాయకుడు రవితేజని ఒప్పించి మరీ తదుపరి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ఈ డైరెక్టర్. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు సరిపడే కథని సిద్ధం చేసుకున్న ఈ చిత్రంలో సునీల్ పూర్తి నిడివిగల కమెడియన్‌గా కనిపించనుండడం విశేషం. ఇదిలా వుంటే...అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని సమాచారం. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో రవితేజ చిన్నప్పుడు సీన్స్‌తో పాటు విలన్‌పై కొన్ని సన్నివేశాలని చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో రవితేజకి సంబంధించిన సన్నివేశాలేమీ ఉండవట. అయితే, హైదరాబాద్‌లో జరిగే రెండో షెడ్యూల్‌లో రవితేజ పాల్గొంటారని సమాచారం.
రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం వుందని చిత్ర బృందం తెలుపుతోంది. కొంతమంది హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా వుంటే...ప్రస్తుతం రవితేజ, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో ‘నేల టికెట్’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.