YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టాప్ ప్లేయర్స్ ను వదిలేస్తున్న ఫ్రాంచైజ్ లు

 టాప్ ప్లేయర్స్ ను వదిలేస్తున్న ఫ్రాంచైజ్ లు
ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న కొందరు టాప్ ప్లేయర్స్‌ను వదిలేస్తున్నాయి. ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ.10కోట్లకి పైగాపోసి కొనుగోలు చేసిన ఆటగాళ్ల‌ని వదులుకునేందుకు తాజాగా ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ‌లు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.కోట్లు పోసి స్టార్ ఆటగాళ్లని కొనుగోలు చేసినా.. వారు ఆశించిన మేర రాణించకపోవడంతో గుర్రుగా ఉన్న ఫ్రాంఛైజీలు.. వచ్చే ఏడాది వారిని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు.దీనివల్ల వేలంలో ఇతర ప్లేయర్స్‌ను కొనుగోలు చేసేందుకు కాస్త డబ్బులు మిగుల్చుకుంటున్నాయి. ఈ ప్లేయర్స్ లిస్ట్‌లో కేఎల్ రాహుల్, మనీష్ పాండే, జైదేవ్ ఉనద్కట్, బెన్ స్టోక్స్‌లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ వేలంలో భారీ మొత్తాలు చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే వీళ్ల ప్రదర్శన మాత్రం దారుణంగా ఉండటంతో ఫ్రాంచైజీలు వదిలించుకోవాలని చూస్తున్నాయి. కేఎల్ రాహుల్‌ను మినహాయించి మిగతా అందరు ప్లేయర్స్ భారీ మొత్తాలు అందుకున్నా.. గత సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ గత వేలంలో మనీష్ పాండేను 11 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే అతడు సీజన్ మొత్తంలో కేవలం 284 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతన్ని సాగనంపాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే భారీ కొనుగోళ్లతో ఎక్కువగా నష్టపోయింది. గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్‌ను రాయల్స్ కొనుగోలు చేశారు. అయితే అతను దారుణంగా విఫలమయ్యాడు. అటు రూ.11.5 కోట్లు పోసి కొన్ని జైదేవ్ ఉనద్కట్ కూడా రాజస్థాన్ టీమ్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. మొత్తం సీజన్‌లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు.2018 ఐపీఎల్ సీజన్‌కి ముందు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అత్యధిక ధరకి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (రూ. 12.5 కోట్లు), భారత యువ ఫాస్ట్ బౌలర్ జయదేశ్ ఉనద్కత్ (రూ.11.5 కోట్లు)‌లను కొనుగోలు చేసింది. అలానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. ఏకంగా రూ. 11 కోట్లు వెచ్చించి మరీ మనీశ్ పాండేని తీసుకుంది. కానీ.. ఐపీఎల్ 2018 సీజన్‌లో ఈ ముగ్గురూ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో.. వీరిని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీలు తాజాగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మనీశ్ పాండే చేసిన పరుగులు 284 మాత్రమే. దీంతో.. అతను కొన్ని మ్యాచ్‌ల్లో కనీసం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ఆల్‌‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ది కూడా ఇదే బాట. అతను సీజన్ మొత్తం 196 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. భారీ అంచనాల మధ్య ఊహించని ధరకి అమ్ముడుపోయిన జయదేశ్ ఉన్కదత్.. టోర్నీలో నిరాశపరిచి 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో వీరిపై నిరాశతో ఉన్న ఫ్రాంఛైజీలు వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబరులో జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఈనెల 15లోపు ఫ్రాంఛైజీలు తాము వద్దనుకుంటున్న ఆటగాళ్లని వదులుకునే వెసులబాటు ఉంది.

Related Posts