సాగునీరు లేక మూడేళ్లుగా పంటలు వేయడం లేదని పలువురు రైతులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. వర్షాధారంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని,,పెట్టుబడులు సైతం రాక వలస పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 298వ రోజు విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూనే వారి కష్టాలూ చెప్పుకున్నారు. జంఝావతి రబ్బర్ డ్యాం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ డ్యాం ద్వారా సీతానగరం మండలానికి సాగునీరు అందిస్తామని ఈ పాలకులు చెప్పినప్పటికీ అది నెరవేర లేదు. అసలు వరి నాట్లే పడని పొలాలు ఎన్నో ఉన్నాయి’ అని రైతులు, రైతు కూలీలు జననేతతో చెప్పుకున్నారు. సాగునీరు లేకున్నా ఎన్టీఆర్ జలసిరి ద్వారా సోలార్ బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఆ లబ్ధి చేకూర్చారని వాపోయారు. తాము ఇప్పటికి నాలుగు మార్లు దరఖాస్తు చేసుకున్నా ఎన్టీఆర్ జలసిరి బోర్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కష్టాలు పడుతూ కూడా పంట పండిస్తే.. ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని కంట తడి పెట్టారు. పెట్టుబడులు కూడా రావడం లేదని, ఎరువులు, క్రిమి సంహారక ముందుల ధరలు వందల్లో పెరిగి పోతుంటే మద్దతు ధరలు మాత్రం కేవలం రూ.50 చొప్పున పెంచితే మా రెక్కల కష్టం ఏం కావాలని వారు ఆవేదన చెందారు.