: భర్త : ఏమేవ్...ఈ విషయం విన్నావా..!
భార్య : ఏ విషయమండీ....
భర్త : మా మగాళ్ళందరూ సగటున రోజు కి రెండు వేల పదాలు మాట్లాడితే...మీ ఆడాళ్ళు నాలుగు వేల పదాలు మాట్లాడగలరంట...????????
భార్య : అవును మరి..మీకు ఏవిషయమైనా..రెండు సార్లు చెప్పందే...అర్ధమై చావదు గా...????????
భర్త : ఏమన్నావ్..... ????????
భార్య : అదే చెప్పా...మరి.
????????????????
తండ్రి కొడుకుతో కోపంగా..
కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా. నీకు కొత్తిమీరకు పుదీనాకూ తేడా తెలియదా..? తాడిచెట్టులా పెరిగితే సరిపోయిందా వెళ్ళు వెళ్ళు. ఇల్లు వదిలి వెళ్ళిపో తెలుస్తుంది జీవితం అంటే ఎంటో..?!
కొడుకు : సరే నాన్న పద ఇద్దరమూ ఇల్లు వదిలి వెళదాం పద..
తండ్రి : ఎందుకు నేనెందుకు..?!
కొడుకు : అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంటా..!!
????????????