శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి ప్రత్యేక రోజులను ప్రకటించే అవకాశం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చెప్పారు. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలకు ఈ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసారు. మండల - మకరవిళక్కు పూజల సమయంలో శుక్రవారం ఈ దేవాలయాన్ని తెరుస్తారు. మకర సంక్రాంతి తర్వాత మళ్ళీ మూసివేస్తారు. మరోవైపు గురువారం సీఎం నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాకౌట్ చేశాయి. భేటీ తరువత సీఎం మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడితో చర్చలు జరుపుతామని అన్నారు. పండలం ప్యాలెస్ ప్రతినిథులతో కూడా మాట్లాడతామన్నారు. అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి ప్రత్యేక రోజులను కేటాయించడానికి చర్చలు జరుపుతామని తెలిపారు.