ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ హాయంలో జరుగుతున్న అభివృద్ది కేంధ్ర ప్రభుత్వ సహకారంతో జరిగిందంటూ మోదీ ప్రచారం చేసుకుంటున్నారని సిఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవ చేశారు. గురువారం నాడు విశాఖలో ఫిన్ టెక్ ఫెస్టివల్ లో పాల్గోన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విశాఖను ఐటి హబ్ గా తీర్చిదిద్ది గేమింగ్ ఎడ్యుకేషన్ లో గ్లోబల్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. రాబోయే తరంలో కీలకంగా మారే డిజిటల్ లెర్నింగ్ కి ఈ ఐ-హబ్ తొడ్పాటునిస్తుందని ఆయన వివవరించారు. ఆర్ట్ ఆప్ లెర్నింగ్ కు తమ ప్రభుత్వం ఎంతో ప్రాదాన్యతను ఇస్తోందని చెప్పిన చంద్రబాబు, తరగతి గదుల్లో ఒత్తిడితో కూడిన విద్య కాకుండా ఫిన్ ల్యాండ్ వలె ప్రయోగాత్మక విద్యావిధానాలను అవలంబించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గదుల్లో కన్నా దైనందిన కార్యక్రమాల్లో ఎక్కువ నేర్చుకుంటామని అయన అన్నారు. నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే కొత్త విషయాలు అవగతమవుతాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ణానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సిలబస్ తగ్గించడమే కాకుండా, బోధనల్లో మరిన్ని మార్పులు రావాలన్నారు. సాధన చేయడంలోనూ విద్యార్థులకు కొత్త మెలకువలు నేర్పాలన్నారు. భవిష్యత్ లో వచ్చే మార్పులను ఎవరూ ఊహించలేరన్నారు.