YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

‘వాట్సప్ పేమెంట్స్’ సేవలు రెడీ

‘వాట్సప్ పేమెంట్స్’ సేవలు రెడీ

స్మార్ట్‌ఫోన్ యుగంలో ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్ మెసెంజర్... తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసు కొచ్చింది. మొబైల్ ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు ఇకపై చెల్లింపులు చేయవచ్చు. ‘వాట్సప్ పేమెంట్స్’ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా వాట్సప్‌లో నగదు లావా దేవీలు నిర్వహించుకోవచ్చు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ మొబైల్‌లో ‘వాట్సప్ బీటా వెర్షన్’ వినియోగిస్తున్న వారు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్‌లో 2.18.21 వాట్సప్ వెర్షన్, ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు 2.18.41 వెర్షన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పేమెంట్స్ ఆప్షన్ లాగిన్ అయిన వారికి మాత్రమే నగదు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది.
ఎలా ఉపయోగించాలి
వాట్సప్ ద్వారా నగదు చెల్లింపులు చేయదలచుకున్నవారు ముందుగా వాట్సప్‌లో ని చాట్ విండో ఓపెన్ చేయాలి. చాట్ విండో ఓపెన్ చేయగానే గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్స్ జాబితాతో పాటు కనిపించే ‘పేమెంట్స్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే బ్యాంకుల జాబితాలో యూపీఐ కనెక్షన్ ఉన్న మీ బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ యూపీఐ పేమెంట్స్‌ను వినియోగించకపోతే ధ్రువీకరణ కోసం పిన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత యూపీఐ యాప్ లేదా బ్యాంకు వెబ్‌సైట్, యాప్ ద్వారా యూపీఐ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి. లావాదేవీలు జరిపే ఇద్దరికీ వాట్సప్ బీటా వెర్షన్ తప్పకుండా ఉండాలి.

Related Posts