YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని రైల్వే జోన్

ముందుకు సాగని రైల్వే జోన్
భారతదేశంలో 17 రైల్వేజోన్లు ఉన్నాయి. అందులో ఉత్తరభారతంలో 14, దక్షిణాదిన మూడు ఉన్నాయి. చెన్నరు, బెంగుళూరు (హుబ్లీ), సికింద్రాబాద్‌లో మాత్రమే రైల్వే జోన్లు వున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్‌ ఇస్తామని కేంద్రం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. రాయలసీమ ప్రాంతంలోని గుంతకల్లు డివిజన్‌ పరిధిలో గత పదేళ్లలో ఒక్క కొత్త రైలు కూడా కేటాయించకపోవడం దారుణం. ఎపిలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు విశాఖ, గుంతకల్లు డివిజన్లు అనుకూలంగా వున్నా కేంద్రం నిర్లక్ష్యం కారణంగా వాటి ప్రస్తావన రావడం లేదు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వే డివిజన్‌ రాయలసీమలోని ఏకైక రైల్వే డివిజన్‌. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో అత్యధిక ఆదాయం తచ్చే ఈ డివిజన్‌ 9 దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ డివిజన్‌ రూపరేఖలు మారడం లేదు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ ముంబై-చెన్నై మెయిన్‌ లైన్‌గా బ్రిటీష్‌ హయాంలో 1927లో ఏర్పడింది. 1956లో డివిజన్‌గా ఏర్పడి సౌతేర్న్‌ రైల్వేలో 
భాగస్వామి అయ్యింది. 1977 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలోకి మార్చబడింది. 1400 కిలోమీటర్ల పరిధిలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ విస్తరించింది. ప్రతి రోజు 180కి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా దాదాపుగా లక్షన్నర వరకు ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రతి ఏటా రూ.1100 కోట్లకు పైగా ఆదాయం తెస్తున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. కేవలం ఏడున్నర కోట్ల రూపాయలతో కొత్త స్టేషన్‌ నిర్మించి చేతులు దులుపుకున్నారు. ఇదే క్రమంలో విశాఖ రైల్వే డివిజన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో ఏపికి రైల్వే జోన్‌ విషయంలో అన్యాయం జరిగింది. దక్షిణ బారత దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డివిజన్లు అయినప్పటికీ అభివద్దికి మాత్రం నోచుకోని పరిస్థితి. గుంతకల్లు పేరుకు డివిజన్‌ అయినా ప్యాసింజర్‌ రైలు మినహా ఇక్కడ నుంచి బయలుదేరే ఒక్క ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా లేకపోవటం గమనార్హం. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ లో ఈ డివిజన్‌కు అన్యాయమే జరుగుతోంది. కరువు ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలకు జోన్‌ వస్తే పారిశ్రామిక, వ్యాపార పురోగతి చెందే అవకాశాలు వున్నాయి. రాయలసీమ నాయకులు మాత్రం దశాబ్ధాలుగా మరుగున పడుతున్న రైల్వే జోన్‌ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు 
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతకల్లు - డోన్‌, పెండేకల్‌ - డోన్‌ మీదుగా డబుల్‌ లైన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపుగా 40 కిలోమీటర్లు పనులకు గాను 27 కిలో మీటర్లు పూర్తి అయ్యింది. నిత్యం మూడు కోట్ల మేర ఆదాయం ఈ డివిజన్‌ నుండి లభిస్తున్నది. అనంతపురంలో కొత్త స్టేషన్‌ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయంటున్నారు.

Related Posts