మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత జైత్రయాత్ర సాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా సాగుతూ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మిథాలీ రాజ్ (56 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) కీలక అర్ధ సెంచరీతో రాణించగా, స్పిన్నర్లు రాధా యాదవ్ (3/25), దీప్తి శర్మ (2/15) వణికించారు. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి ఐర్లాండ్ 8 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది.