YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమంలో ఏపీ ఫస్ట్

 సంక్షేమంలో ఏపీ ఫస్ట్
ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందుచూపుతో రాయలసీమకు సాగు, తాగునీటిని అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామనీ, ప్రజల ఇబ్బందులను ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.  రాబోయే రెండేళ్లలో రాష్ట్రం ఓడీఎఫ్(బహిరంగ మలమూత్ర విసర్జన రహితం)గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచబోమనీ, విద్యుత్ ను ఆదాచేయడంతో పాటు ప్రత్యామ్నాయ ఉత్పత్తిపై దృష్టి సారిస్తామన్నారు. గత నాలుగేళ్లలో దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో 10.50 శాతం అభివృద్ధిని నమోదుచేశామన్నారు. విద్యుత్ ను సమర్థవంతంగా వాడుకునే బోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విద్యుత్ ను డిస్కమ్ లకు అమ్ముకోవడం ద్వారా రైతుకు నెలకు మరో రూ.4-5 వేల చొప్పున అదనపు ఆదాయం వస్తుందన్నారు.అమరావతి ప్రాంతంలో తనను నమ్మి రైతులు భూములను అప్పగించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ‘మీ భూములు నాకు ఇవ్వండి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం నేను చూపిస్తా’ అని రైతులకు చెప్పానని బాబు అన్నారు. దానికి రైతులందరూ సంతోషంగా అంగీకరించారని పేర్కొన్నారు. అమరావతికి ఏపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేవలం ఓ ఐడియాతోనే ఈ అద్భుతం సాధ్యమయిందనీ, 35,000 ఎకరాలను సేకరించగలిగామని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ రోజు ‘జయహో బీసీ’ సభ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల విలువ అప్పట్లోనే రూ.40,000-50,000 కోట్లు ఉండేదని చెప్పారు. ఇందులో 20-30 శాతం భూమిని రైతులకు తిరిగి ఇచ్చామన్నారు. అమరావతిలో ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్, నీళ్లు, వరద ప్రవాహం వ్యవస్థలను భూగర్భంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీలో పరిపాలన భవనం 1650 ఎకరాల్లో నిర్మిస్తున్నామనీ, ఇలాంటి వసతి ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ‘జయహో బీసీ’ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఈ నెల 30న జయహో బీసీ బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.

Related Posts