YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

బాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి
ఏపీ సీఎం టార్గెట్‌గా మరోసారి సెటైర్లు పేల్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మొన్నే ఆదరణ పథకంపై విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ ఎంపీ.. తాజాగా ఆశా వర్కర్ల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పంచ్‌లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో.. ‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు దేశ భక్తుల గురించి చెబుతారు. అందరికి ఆదర్శవంతమైన శ్రీరామ రాజ్యం గురించి చెప్పి.. మాట తప్పిన వాడు మనిషి కాదని నూరిపోస్తారు. కాని చంద్రబాబు మాత్రం వెన్నుపోటు దారుల గురించి, రాజకీయ బ్రోకర్ల గురించి నూరిపోయాలని చెబుతున్నారని’ మండిపడ్డారు. ‘మిమ్మల్ని చూసి పిల్లలకు జ్వరాలు వచ్చిన సంగతి మర్చిపోయారా. మీ సొంత మనవడు ఏడాది వరకు మీరు కనిపిస్తే గుక్క పెట్టి ఏడ్చేవారని ప్రజలు చెప్పుకుంటారు. నిజాయితీ అనే మాటకు వ్యతిరేకార్థం మీరు. అవకాశవాదానికి చిరునామా ఎవరా అంటే దేశం మొత్తం మీరేనంటోంది. ఆంధ్ర ప్రజలకు పట్టిన శని మీరు. పిల్లల భవిష్యత్‌ను చిదిమేసిన పాపాన్ని మూటగట్టుకొన్న మీ గురించి ఉగ్గు పాలతో తల్లిదండ్రులు నూరిపోయాలా చంద్రబాబు’అని ప్రశ్నించారు. ‘చిన్న పిల్లలు పెద్దవారయ్యాక కూడా మీ తరాలకు ఓటేయాలా.. మరో తరం మీలాంటి మోసగాళ్లను భరించాలా.. తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు టీవీలో కనిపిస్తే చిన్నపిల్లల తల్లిదండ్రులు టీవీ మారుస్తారు. రావణుడు, నరకాసురుడు ఎవరని పిల్లలు అడిగితే.. తల్లిదండ్రులు టాపిక్ మారుస్తారు.. మీ చరిత్ర అంతే చంద్రబాబు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Related Posts