YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా పుంజుకోవడం ప్రారంభిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మీద దృష్టి పెడతారు. అయితే బంధుమిత్రుల తాకిడి తప్పదు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి.

వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఇంటా బయటా పని భారం ఎక్కువవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. అనుకున్న పనులు చాలావరకు నెరవేరవచ్చు. ఎవరికీ గ్యారంటీ ఉండొద్దు. ప్రేమల్లో ఆచితూచి అడుగువేయండి. 

మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
ఉద్యోగాలు, చదువుల్లో పిల్లల ప్రోగ్రెస్ బాగుంటుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. మీ దగ్గర ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త.
 
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
ఆదాయానికి లోటుండదు. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు తప్పవు. స్థాన చలనానికి అవకాశం ఉంది. ప్రమోషన్ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. సహాయం పొందిన బంధువులు ముఖం చాటేస్తారు. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు, ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో సవుస్యలు తొలగిపోతాయి. ప్రయాణాలలో జాగ్రత్త. ప్రేవులకు ఇది సమయం కాదు. పిల్లలతో వినోదాల్లో గడుపుతారు. 

కన్య (ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
ఆర్థికంగా బాగుంటుంది. అర్ధాష్టమి కారణంగా మధ్య మధ్య మనశ్శాంతి లోపిస్తుంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పని భారం బాగా పెరుగుతుంది. ప్రేమకు అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
తీర్థయాత్రలకు అవకాశాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. కొత్త ఉపాధి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్థలం గానీ, ఇల్లు గానీ కొనాలని నిర్ణయించుకుంటారు. 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఏలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య ఆర్థిక చిక్కులు ఎదురవుతుంటాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తిప్పట తప్పదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. 
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఆదాయానికి లోటు ఉండదు. జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇల్లు మారే సూచనలున్నాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ప్రేవులకు కాస్తంత దూరంగా ఉండండి. 

మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2))
ఏలిన్నాటి శని కారణంగా పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయుత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టవచ్చు. 
 
కుంభం (ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ పలుకుబడి పెరుగుతుంది. పెళ్లి బాజాలు మోగుతాయి. తీర్థయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పిల్లలు ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 

Related Posts