రాష్ట్రం విడిపోయాక అత్యధిక రెడ్డి వర్గం తెలంగాణలోనే ఉండిపోయింది. అయినా, వైఎస్ జగన్ తెలంగాణలో పార్టీని కాపాడుకోలేకపోయారు. దీనికి కారణం రెడ్లు వైఎస్‌పై చూపిన ప్రేమ అతనిపై చూపకపోవడమే. జగన్ వ్యవహారశైలి వల్ల సీనియర్ నేతల మద్దతు ఉన్నా కూడా అధికారాన్ని కాలదన్నుకున్నాడు. అహంకారం ఎంతటి మనిషిని అయినా తినేస్తుంది అని చెప్పడానికి జగనే ఉదాహరణ.ఈసారి ఎలాగైనా సీఎం సీటు ఎక్కాల్సిందే… అవసరమైన వ్యూహాలు రచించండి అని జగన్ తన వంగమాగదులను ఆదేశించారట. వారంతా సర్వేలు చేసి తేల్చిందేంటంటే… మీరు రెండు వర్గాలను ఆకట్టుకోవాలి. ఒకటి కమ్మ. రెండు తటస్థులు. తటస్థుల్లో మీకు ఎలాగూ ఆదరణ లేదు. ఇక కమ్మలు మీ వైపు రారు అని చెప్పారంటే. దీనిని అధిగమించడానికి జగన్ ఒక బ్రహ్మాండమైన ఐడియా వేశారట. గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతలకు తమ కులంలో బాగా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వారిని ప్రలోభ పెడితే… వారికు సంప్రదాయంగా పడే ఓటు బ్యాంకు మనకు పడుతుంది కదా ఆ పనిచేయండి. కమ్మ నేతలను పిలిపించండి వారిని ప్రేమించండి అని చెప్పారట జగన్. అప్పట్నుంచి కమ్మలపై వైసీపీ తెగ ప్రేమ చూపుతోంది.
ముఖ్యంగా కమ్మ వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ, గుంటూరు జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన వ్యాపార వర్గాన్ని, రాజకీయ నేతలను ఆహ్వానిస్తోంది. అందరికీ పర్సనల్ ఇన్విటేషన్లు పంపుతోందట. మీరు కనుక మా పార్టీలో చేరితో మంచి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారట జగన్. అయితే, జగన్ వస్తే కదా పదవులు ఇవ్వడానికి… మేము ఆ పనిచేస్తే ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చినపుడు చూద్దాంలే అని జగన్ ప్రలోభాలను తిరస్కరిస్తున్నారట