YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తమ్ముళ్లకు అడ్డుపడుతున్న మంత్రులు

తమ్ముళ్లకు అడ్డుపడుతున్న మంత్రులు
విశాఖ జిల్లాలో గత నాలుగేళ్ల నుండి అదుగో..ఇదుగో నామినేటెడ్‌ పదవుల పంపకం మని స్థానిక నేతలను, కార్యకర్తలను ఊరిస్తున్నారు తప్ప ఇంత వరకు వాటిని భర్తీ చేయలేదు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు కలహాలతో ఎవరికి వారు తమ వారికి పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో..ఆయా పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. చివరకు రాష్ట్ర స్థాయిలో అనేక మంది పదవులు లభించినామవిశాఖ జిల్లాకు చెందిన నాయకులెవరికీ ఆయా పదవులు లభించలేదు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు..మంత్రులిద్దరూ ఆధిపత్యపోరులో ఉన్నారు. పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోరు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ..పంచాయితీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌ కానీ..ఎందుకో వేలు పెట్టడంలేదు.కార్యకర్తలను ఎదురుచూపులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇటీవల కొన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పినా అది ఆచరణకు నోచుకోలేదు. మార్కెట్‌ ఛైర్మన్లు,దేవాలయాల పాలకమండలి సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ పదవితో పాటు..ఇతర ముఖ్యపదవులను ఇంత వరకు భర్తీ చేయలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో ఫలానా పోస్టుకు ఫలానా వారికి ఇవ్వాలని మంత్రులిద్దరూ కలసిజాబితా పంపినా..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించలేదు. విశాఖ జిల్లాలోనే ఈ పరిస్థితి ఉందని, ఇన్‌ఛార్జి మంత్రితో పాటు..ఇతర ముఖ్యనాయకులు కూడా అనేక సందర్భాల్లో తమ ఆవేదన వెళ్లగక్కారు. అయ్యన్నపాత్రుడుకు, గంటా శ్రీనివాసరావులకు మంత్రి పదవులు కావాలి ఎమ్మెల్యేలకు అధికారం కావాలి. కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకులకు ఎటువంటి పదవులు వద్దు అన్న పరిస్థితి విశాఖలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై కొందరు నాయకులు ‘చంద్రబాబు’ను స్వయంగా కలసి ‘సార్‌ నాలుగున్నరేళ్లు గడిచిపోయింది.చిన్న చిన్న పదవులు కూడా భర్తీ చేయడం లేదు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పోస్టు భర్తీ చేయలేదు. అధికారంలోకి వస్తే నాలుగు నెలల్లో నామినేటెడ్‌పోస్టులు ఇస్తామని చెప్పారు. విశాఖలో ఇటువంటి దౌర్బాగ్య పరిస్థితి ఉన్నందుకు బాధగా ఉందని, ఇప్పటికైనా స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ‘చంద్రబాబు’ యథా ప్రకారం అన్నీ తాను చూసుకుంటానని..వారిని మరింత నిరాశ పరిచారు. నాలుగున్నరేళ్లనుంచి నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయకుండా మంత్రులిద్దరూ అడ్డుపడుతుంటే..విషయం తెలిసిన ‘చంద్రబాబు’ దాన్ని సరిదిద్దకుండా వ్యవహరించి కార్యకర్తలకు అన్యాయం చేశారనే విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఇన్‌ఛార్జి మంత్రి పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా కనిపిస్తోంది. ఇప్పుడు పదవులు ఇచ్చినా..ఇవ్వకపోయినా.. పోయేదేమీ లేదు..త్వరలో వచ్చే ఎన్నికల్లో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలే ఓట్లు వేసుకుంటారు.వారికి కార్యకర్తలుఅవసరం లేదు..ఎక్కడే న్షష్టం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యుడని..ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, సీనియర్‌ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలులేవు.అదుగో..ఇదుగో..నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయిస్తాం..నాలుగేళ్ల నుండి మంత్రిలిద్దరూ చెబుతూనే ఉన్నారు. కానీ..ఏదీ ముందుకు వెళ్లడంలేదు. ఇప్పుడు నామినేటెడ్‌ పదవి భర్తీ చేస్తానని చెప్పినా..నమ్మేవారు లేరు. ఆ పోస్టులు కోరుకునే వారు కూడా లేరు. ఏది ఏమైనా విశాఖలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యన్న, గంటాలే కారణమనే విమర్శలు ఉన్నాయి.

Related Posts