తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్స వాలు డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం డిసెంబరు 3వ తేదీ సోమవారం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 27వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం చేపడతారు. బ్రహ్మో త్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగోతేదీ మంగళవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటాయి. ఐదో తేదీ బుధవారం ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆరోతేదీ గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహన సేవలు కొనసాగుతాయి. ఏడోతేదీ శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపైన, రాత్రి హనుమంత వాహనంపైన అమ్మవారు ఊరేగుతారు. ఎనిమిదో తేదీ శనివారం ఉదయంపల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనసేవ ఉంటాయి. 9వ తేదీ ఆదివారం ఉదయం సర్వభూపాలవాహనం, రాత్రి స్వర్ణరథంపై ఊరేగింపు, గరుడవాహన సేవ జరుగుతాయి. పదోతేదీ సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపైన, రాత్రి చంద్ర ప్రభ వాహనంపైన ఊరేగింపులు జరుగుతాయి. 11వ తేదీ మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రిఅశ్వవాహన సేవ ఉంటా యి. 12వ తేదీ ఉదయం పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణం ఉండనున్నాయి. ఈఉత్సవాలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.