YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నరేంద్రమోది, అమిత్ షాలపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజం

నరేంద్రమోది, అమిత్ షాలపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజం
సిబిఐలో సంక్షోభం వల్లే ఏపిలో ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించాం. రాజకీయ కక్ష సాధింపులకు సిబిఐ సాధనం కారాదు. రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే. రాష్ట్రాలకున్న చట్టపరిధిలోనే చేశాం. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశాం. ఏపి స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలు కూడా అదే నిర్ణయం చేపట్టాలని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం అయన ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ధ్వజమెత్తారు.  సంక్షోభంలోకి సిబిఐని నెట్టిందెవరు..? ప్రధాని నరేంద్రమోది కాదా..?ఆర్ బిఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందెవరు? ప్రధాని నరేంద్రమోది కాదా..?  సివిసిపై, పిఎంవోపై సిబిఐ డైరెక్టర్ ఆరోపణలు గతంలో ఉన్నాయా..? ఏ1, ఏ2లు పీఎంవో లో తిరగడం గతంలో చూశామా..? సిబిఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ జివో తెచ్చాం. సహకార సమాఖ్య అని బిజెపి నేతలు ఊదరగొట్టారు. సమాఖ్య స్ఫూర్తినే సర్వనాశనం చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా కేంద్రం బలగాలను సుమోటాగా దించరాదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే కేంద్ర బలగాలు రావాలి. అలాగే సిబిఐ విచారణకు కూడా రాష్ట్రాల అనుమతి అనివార్యం. సిబిఐని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనేది మోది దుర్బుద్ధి. ఆర్ బిఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారు. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని బిజెపి చూస్తోంది. వాటితో తమ ప్రత్యర్ధులపై కక్ష సాధించాలని చూస్తోంది.పేదల సంక్షేమం కంటె రాజకీయ కక్ష సాధింపే మోది, షాలకు ముఖ్యం. రాష్ట్రాల అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలే ముఖ్యమని అన్నారు. కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలపై కక్ష సాధించాలని చూస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారు. జీఎస్టీ, డిమానిటైజేషన్ అన్నింటిలో విఫలం అయ్యారు.గతంలో సిబిఐపై ధ్వజమెత్తిన వైసిపి ఇప్పుడు మద్ధతివ్వడం విడ్డూరం. సిబిఐ భ్రష్టుపట్టాక వైసిపి మద్ధతిస్తోంది. వైసిపి నేతలు బిజెపి మాటలనే వల్లెవేస్తున్నారు.బిజెపి మినహా దేశంలో ఏ రాజకీయ పార్టీ బతకకూడదు. ప్రతిపక్షాలను లేకుండా చేయడమే మోది,అమిత్ షా జోడి లక్ష్యమని ఆరోపించారు. సిబిఐ లాంటి సంస్థలు మోది చేతిలో ఉంటే దేశానికే ప్రమాదకరం. రాజ్యాంగపరంగా రాష్ట్రాలకున్న హక్కులను మోది కాలరాస్తున్నారు. రాజకీయ దుర్భుద్ధితో ప్రధాని నరేంద్రమోది వ్యవహరిస్తున్నారు దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది మోది,షా ల పన్నాగం. ఇతర పార్టీలను కబళించాలని చూస్తున్నారు. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యానికి అంత బలం.  వ్యవస్థల పతనాన్ని నిరోధించడమే టిడిపి సిద్ధాంతమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే టిడిపి లక్ష్యం. రాజ్యాంగ విలువలను రక్షించడం అందరి కర్తవ్యం. నరేంద్రమోదిని గద్దె దించడం ప్రతిఒక్కరి బాధ్యత. 2019లో బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడం అందరి బాధ్యత. దేశంలో నగరాల పేర్లు మార్చడం బిజెపి నేతల మరో తుగ్లక్ చర్య నగరాల పేర్లు మార్చినట్లే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. బిజెపి మళ్లీ గెలిస్తే జాతీయ పతాకాన్ని మార్చేస్తుంది. భారత దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మార్చేస్తారని ఆరోపించారు.

Related Posts