భూ బకాసురుడు చంద్రబాబు. రైతులు ఏవరు స్వచ్ఛందంగా ఇవ్వలేదు. బ్రిటిష్ పాలనా కాలంలో లా నేడు చంద్రబాబు పాలన వుంది. రాజ్యంగ విరుద్దంగా, రాజధాని నిర్మాణం పేరుతో స్విస్ బ్యాంకులతో ఒప్పందం లా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అరోపించారు. శనివారం నాడు అయన తాడేపల్లి మండలం ఉండవల్లి , పెనుమాక గ్రామంలో ఉన్న పోలాలను పరిశిలించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు తమ సమస్యలను బీజేపీ నేతలకు తెలిపారు, ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కన్నా మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరగటంలేదు. రాష్ట్ర పరిస్థితులను కేవలం చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల చూస్తే అర్థం అవుతుంది. గతంలో 3 పంటలు పండేవని చెప్పిన బాబు, నేడు ఆ మాటలు ఏమైనాయి. అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని అన్న మంత్రులు నేడు ఏమైపోయారు. వాళ్ళ బందువులకు అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు పంటలు పండేవి వాటిని ఎలా తిసుకుంటారు. అవినీతి కారకులైన వారికి, అధికారులు సైతం శిక్ష పడటం తథ్యమని అన్నారు. చంద్రబాబు హేరిటేజ్ నుంచి ప్రభుత్వ అధికారులకు జీతం ఇవ్వడం లేదు. అధికారం శాశ్వతం కాదని ఆయన గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. నేడు రాష్ట్రంలో నరకాసుర పాలన సాగుతుంది. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాల రాజ్యం నెలకొంది. తెలుగుదేశం గుండాలు తగులబెట్టిన వాటిని ఇతర పార్టీలపై నెట్టిన ఘనుడు చంద్రబాబు. మా పార్టీ అభివృద్ధికి అడ్డంకిగా కాదు అవినీతి మాత్రమే వ్యతిరేకమని కన్నా వ్యాఖ్యానించారు.