YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తగుదునమ్మా అంటున్న నందమూరి..!!

 తగుదునమ్మా అంటున్న నందమూరి..!!

 మహాకూటమికి రూపకల్పన జరిగిన మరుసటి రోజు నుంచే  తెలంగాణలో ఎన్నికలు జోరు మరింత  పెరిగింది. మహాకూటమి సీట్లు కేటాయింపు తెలంగాణలో జరగకుండా ఢిల్లీ, అమరావతిలో జరుగుతున్నాయి. సీట్లు కేటాయింపు విషయంలో కూటమి లో ఉన్న పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా అమరావతిలో కూర్చుని చర్చల మీద చర్చలు జరిపి.. నయానో  భయానో అందరినీ ఒప్పించి మరీ కూకట్ పల్లి టిక్కెట్ తన బావమరిది,  ఇటీవలే చనిపోయిన హరికృష్ణ కూతురు సుహాసినికి దక్కేట్టు చేసుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ విషయంపై పార్టీ కార్యకర్తలు, నాయకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ స్థానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డి ఆశించారు.
తనకే టికెట్‌ వస్తుందనే ఆలోచనతో ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు.. నందమూరి కుటుంబం పేరుతో ఆయనకు మోండిచేయి చూపించారు. ఈ సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఫై సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే విమర్శలు గుపిస్తున్నారు. మరి ఈ సీటు విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ ఏమిటో తెలియాలి అంటే ఒకసారి ఇది చుడండి...
            మరి కొన్ని రోజులలో ఆంధ్రాలో ఎన్నికలు మొదలు కానున్నాయి.  2009 ఎన్నికలలో చిరంజీవి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో సీఎం కుర్చీ ఫై కూర్చొచ్చని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.. దీనికి బదులుగా చంద్రబాబు తన బావమరిది హరికృష్ణ కుమారుడు జూ.ఎన్టీయార్ ని ప్రచారంలోకి దింపాడు.  కానీ ఆ ఎన్నికలలో ప్రతిపక్ష నేత హోదాకే చంద్రబాబు పరిమితమయ్యారు. తరువాత 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో, బీజేపీతో కలిసి... పవన్ కి ఉన్న ఫాలోయింగ్ వాడుకుని ఈ సారి సీఎం కుర్చీని అధిష్టించారు చంద్రబాబు. సీఎం అయ్యాక హరికృష్ణ కుటుంబాన్ని పెద్దగా పటించుకోలేదు చంద్రబాబు. అలాగే హరికృష్ణ కుటుంబం కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఈ సారి ఎన్నికలలో   
 పవన్ కళ్యాణ్  చంద్రబాబుతో విబేధించి 175 స్థానాలలో తన అభ్యర్థులను నిలబెడుతున్నారు. కనుక ఈ సారి చంద్రబాబు తన పార్టీకి స్టార్ కాంపైనర్ కోసం ఎన్టీయార్ ని బుజ్జగిస్తున్నారు. ఇటీవలె రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణంతో మళ్ళి చంద్రబాబు హరికృష్ణ కుటుంబానికి దగ్గరయ్యారు. ఈ సారి ఏపీ ఎన్నికలలో జూ.ఎన్టీయార్ తో మళ్ళి ప్రచారం చేయించడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారు. 2009 తో పోల్చుకుంటే జూ.ఎన్టీయార్ వరుస విజయాలతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు. కావున తెలంగాణలో జరిగే ఎన్నికలలో హరికృష్ణ కుటుంబం నుంచి అయన కుమార్తె  సుహాసినికి కేటాయించి... తెలంగాణ లో జరిగే ఎన్నికలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఈ సారి కూడా ఏపీ సీఎం కుర్చీని అధిష్టించాలని చూస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయం కోసం ఎటువంటి పనులైనా చేస్తారు.. అవసరమైతే అధికారం కోసం తన మనవడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. మరోవైపు ప్రత్యేక తెలంగాణ ఇవ్వకూడదని తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ కుమార్తెను తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
 

Related Posts