నాలుగున్నర సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాం. కేవలం రాజకీయ లబ్ధికోసం అన్యాయంగా విభజించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుతున్న అభివృద్ధి చూస్తే విభజన జరగడమే మంచిది అన్నట్లుగా ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. శనివారం అయన నరసరావుపేట SSN కాలేజ్. ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివుద్ది సంస్థ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముపైకి పైగా కంపెనీలు, రెండు వేలమందికి పైగా యువతియువకులు పాల్గోన్నారు. కోడెల మాట్లాడుతూ విభజన తర్వాత 24గంటల విద్యుత్, పెద్ద సంఖ్యలో ప్రపంచస్థాయి విద్యాలయాలు, కంపెనీలు, గోదావరి కృష్ణా కలయిక, పోలవరం, రేషన్, గ్యాస్, వెయ్యి రూపాయల పెన్షన్లు, cc రోడ్లు, ఇళ్లు, మహిళలకు రుణాలు, భీమా ఇలా ఎంతో అభివృద్ధి జరుతుంది. ఏ రాష్ట్రంలోనైనా పవర్, వాటర్ పుష్కలంగా ఉంటే అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. డిగ్రీ ఉన్నంత మాత్రాన జాబ్ రాదు... స్కిల్స్ ఉండాలని అన్నారు. అలాంటి స్కిల్స్ ని ఏపి స్కిల్స్ డెవలఫ్ మెంట్ కార్పోరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది. అక్కడ స్కిల్స్ డెవలఫ్ చేసుకున్న వారికి జాబ్ కచ్చితంగా వస్తుంది. నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుతుందని అన్నారు. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలి అగ్రికల్చర్ జీడీపీ .50 శాతంగా ఉంది. ఏపీకి సుదీర్ఘమైన తీరప్రాంతంతో పాటు యువశక్తి ఎక్కువగా ఉంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి కంపెనీలో తెలుగువారు ఒకరు ఉంటారు. ఇక్కడ కు వచ్చిన కంపెనీల వాళ్లు మీలో స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తారు. సబ్జెక్ట్ తో పాటు సమాజంపై అవగాహన, మంచి ప్రవర్తన ఇలాంటి మీలో ఉంటేనే జాబ్ వస్తుంది. స్కిల్స్ డెవలఫ్ సెంటర్ ద్వారా యువత మీలో ఉన్న స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని అన్నారు. సీఎం స్థాయిలో పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. కియాతో అనంతపురం రూపురేఖలు మారిపోయాయి. నేడు ప్రపంచంలో తయారవుతున్న ఫోన్ లలో ఒకటి ఏపీలో తయారవుతుంది. గతంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుండి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ జాబ్ మేళాని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.