ఏపీలో అధికార పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. పదహారు రోజుల్లో సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 13 లక్షలు దాటింది. అక్టోబర్ 31 న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసింది. నవంబర్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్ లో 2016 లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 64,50,931 మంది సభ్యులు గా నమోదు అయ్యారు. ఇప్పుడు 16 రోజులకే ఈ సంఖ్య 13 లక్షలకు చేరుకుంది.దీనితో 2018 లో జరుగుతున్న సబ్యత్వ నమోదు కార్యక్రమం నూతన రికార్డులు సృష్టిస్తోందని పార్టీ అంచనా వేస్తుంది. కుప్పం,బనగానపల్లె, రాయచోటి,ఉదయగిరి, నరసరావుపేట నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అలాగే, మొదటి ఐదు స్థానాల్లో తూర్పుగోదావరి,కృష్ణా, కర్నూలు,పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు ఉన్నాయి