YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు మానసిక స్థితి బాగాలేదు

బాబు మానసిక స్థితి బాగాలేదు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మానసిక స్థితి బాగోలేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తి సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్సీపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును నరకాసురుడిగా వర్ణించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. 

Related Posts