YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భాజపా చేస్తోంది రథయాత్ర కాదు ‘రావణ యాత్ర’ భాజపాను తరిమికొట్టండి.. దేశాన్ని కాపాడండి: మమతా బెనర్జీ పిలుపు

భాజపా చేస్తోంది రథయాత్ర కాదు ‘రావణ యాత్ర’      భాజపాను తరిమికొట్టండి.. దేశాన్ని కాపాడండి: మమతా బెనర్జీ పిలుపు

భాజపా చేస్తోంది రథయాత్ర కాదు ‘రావణ యాత్ర’అని  పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. పార్టీ కోర్‌ కమిటీ ఏర్పాటు చేసి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో మత వాదాన్ని రెచ్చగొట్టే భాజపాను ఏ రాష్ట్ర ప్రజలూ కోరుకోరని ఆమె విమర్శించారు.ఆ పార్టీ విభజన రాజకీయాన్ని అవలంభిస్తోంది దుయ్యబట్టారు.. వారు ప్రాంతాల పేర్లను మార్చేస్తారు. పాలసీలను మార్చేస్తారు. ఇలాంటి వాళ్లు దేశానికి ప్రమాదం. భాజపాను తరిమికొట్టండి.. దేశాన్ని కాపాడండి. ‘పవిత్ర యాత్ర’ పేరుతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో పర్యటించి వాటిని ప్రక్షాళన చేస్తాం. భాజపా రథయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచి దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని బీర్బం, కూచ్‌బెహార్‌, గంగాసాగర్‌ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తాం. భాజపా రథయాత్రతో అపవిత్రమైన ఈ ప్రాంతాలని పవిత్ర యాత్రతో ప్రక్షాళన చేస్తాం. వచ్చే ఏడాది జనవరిలో కోల్‌కతాలో మెగా ర్యాలీని నిర్వహించనున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్‌ రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ర్యాలీ 2019 ఎన్నికలకు కీలక మలుపు అవుతుంది. మత వాదాన్ని రెచ్చగొట్టే, విభజన రాజకీయాలను చేసే భాజపాను ఏ రాష్ట్ర ప్రజలూ ఆహ్వానించరు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భాజపా రథయాత్ర పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బీర్బం, కూచ్‌బెహార్‌, గంగాసారగ్‌ ప్రాంతాల్లో డిసెంబర్‌ 5,7,9 తేదీల్లో ఈ రథయాత్రను నిర్వహించనున్నారు.

Related Posts