YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పరుగులు పెడుతున్న పోలవరం మే 30 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు

 పరుగులు పెడుతున్న పోలవరం మే 30 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు
పోలవరం ప్రాజెక్టులో మరో అంకానికి జలవనరుల శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. ఎగువకాఫర్‌ డ్యాం పనుల ప్రారంభానికి పూజలు జరిపారు. ప్రాజెక్టులో నాణ్యత విభాగం పనులు పరిశీలిస్తున్న ఎస్‌ఈ జి.ఆనంద్‌కుమార్‌ వీటిని ప్రారంభించారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటి ద్వారా నీరు ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు స్పిల్‌వేలో గేట్ల బిగింపుతోపాటు, గోదావరి నదిపై ఎగువకాఫర్‌ డ్యాం నిర్మాణంతో సర్కారు సంకల్పం నేరవేరుతుంది. తదనుగుణంగా అధికారులు గోదావరి మధ్యలో 1,225 మీటరు వద్ద డ్యాం పనులకు పూజలు జరిపారు. రాబోయే 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నారు.జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తయినందున దానికి ఇరువైపులా 6 మీటర్ల వెడల్పున కాఫర్‌ డ్యాం నిర్మాణం తలపెట్టారు. ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించాలన్న పట్టుదల ఇంజనీర్లలో కనిపిస్తోంది. జెట్‌గ్రౌటింగ్‌ పూర్తికి ఎంత క్రియాశీలంగా వ్యవహరించారో.. కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి మరోసారి తమను తాము నిరూపించుకోవాలని వారు భావిస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఆరంభం కాకమునుపే పనులన్నిటినీ పూర్తిచేసి, సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించే ఉద్దేశంతో కాంట్రాక్టు సంస్థలు పనులకు ఉపక్రమించాయి. దీనిని మే 30లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నెలరోజుల ముందే పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థ నవయుగ సంకల్పించింది. అందుకు తగినట్లుగానే ఆధునిక యంత్రాలను రప్పిస్తోంది.నిర్మాణం ఇలా.. గోదావరిలో సుమారు 2,480 మీటర్ల పొడవున, 187ను ంచి 237 మీటర్ల మేర వెడల్పున.. 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మిస్తారు. దీనికిగాను 66.751 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాయి, మెటల్‌ను నిర్మాణంలో వినియోగిస్తారు. ఇందులో 42.324 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, 5.116 లక్షల క్యూబిక్‌ మీటర్ల హీటింగ్‌ సాయిల్‌, 3.573 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 26,700 క్యూబిక్‌ మీటర్ల జిగురుమట్టిని వాడతారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగిన ప్రాంతంలో 6మీటర్ల వెడల్పున ఇరువైపులా నల్ల మట్టితో నింపుతారు. ఇలా నింపే నల్లమట్టిని ఏ రోజుకారోజు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో పరీక్షలు చేస్తారు. దీనికి సంబంధించి అత్యంత ఆధునికంగా సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

Related Posts