ఎపి సర్కార్ కి ముఖ్య కార్యదర్శులుగా పని చేసిన వారు ప్రతిపక్షం లా మారిపోయారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు ఒక పక్క తగులుకుంటూ ఉంటే, మరోపక్క అజయ్ కల్లాం ఇంకో పక్క బాబు సర్కార్ కి నిద్ర పట్టనీయడం లేదు. ప్రభుత్వంలో జరుగుతున్న తతంగం అంతా దగ్గరుండి చూసినవారు కావడంతో వీరు చేసే ఆరోపణలు విపక్షాలకు అస్త్రాలుగా చిక్కుతున్నాయి. ఫలితంగా సర్కార్ క్రెడిబిలిటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. దాంతో ఎపి సర్కార్ కి తలపోట్లు తప్పడం లేదు.ఏపీలో ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం అవుతుందో సోదాహరణంగా చెప్పుకొచ్చారు కలాం. తమకు అనుకూలంగా వున్న మీడియా సంస్థకు గత నాలుగేళ్లుగా 700 కోట్ల రూపాయలను సర్కార్ ధారపోసిందన్నారు ఇక ఎన్ ఆర్ జి సి కింద కేంద్రం కేటాయించిన 20 వేల కోట్ల రూపాయల్లో మూడోవంతు మింగేశారని ఆయన ఆరోపించారు. ఇక పోలవరం పనులు పక్కన పెట్టి పురుషోత్తపట్నం, పట్టిసీమ లలో తిన్న సొమ్ము అందరికి తెలిసిందే అన్నారు. విద్యా, వైద్యం, ఇసుక, మట్టి మాఫియా లతో పాలన సాగుతుందని ఆరోపించారు కలాం. ప్రజల సొమ్ము ను పాలకులు ఈ తీరుగా దుర్వినియోగం చేయడాన్ని కడిగేశారు ఆయన. అజేయ్ కలాం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పసుపు పార్టీలో కలవరం రేకెత్తించాయి. మరోపక్క ఆయన ఆరోపణలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.