YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్యలకు చెక్

 హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్యలకు చెక్

-  బతుకుపై విరక్తికి మజిలీ ట్యాంక్ బండ్

హైదరాబాద్ కు  మణిహారం హుస్సేన్ సాగర్ పర్యాటకంగానే కాదు బతుకుపై విరక్తి చెందిన వారికి చివరి మజిలీగా కూడా మారుతోంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు, ఏదో ఒక సాంస్కృతిక, క్రీడా సంరంభాలు జరిగే స్థలమిది. వీటన్నిటి పర్యవేక్షణ, రక్షణ కోసం లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు అయింది. ఇక్కడి పోలీసులు సాగర్‌ పరిధిలో ఉన్న ప్రాంతానికే పరిమితమై శాంతి భద్రతలతో పాటు సాగర్‌లో ఆత్మహత్యకు పాల్పడే వారిని రక్షిస్తున్నారు.

అనేక కారణాలతో 
ఆర్థిక కారణాలతో, పిల్లలు ఆదరించలేదని తల్లిదండ్రులు, భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళలు, ప్రేమ వైఫల్యం ఇలా కారణాలేవైనా సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇలా బలవన్మరణానికి పాల్డడేందుకు వస్తున్న వారిని గుర్తించి పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజాగా హుస్సెన్ సాగర్ లో ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కానిస్టేబుల్, స్థానికుడు కాపాడారు. ఓ యువకుడిని ప్రేమించిన యువతి... ఇంట్లో వాళ్లు బలవంతంగా వేరే పెళ్లి చేస్తుండడంతో మనస్థాపానికి గురై హుస్సెన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యం చేసింది. దీనిని గమనించిన కొందరు యువతిని కాపాడి... లేక్ పోలీసులకు అప్పగించారు. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

2015 సంవత్సరంలో 207 మంది
ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిని 2015 సంవత్సరంలో 207 మందిని కాపాడారు లేక్‌ పోలీసులు. 2016 లో 222 మందిని, 2017లో 168 మందిని, ఈ ఏడాది ఇప్పటి వరకు 24 మందిని కాపాడారు. 2015లో 47 మంది సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో 39 మంది, 2017లో 28 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.అయితే 7 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన సాగర్‌ చుట్టూ శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేవలం 39 మంది సిబ్బందే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిబ్బందిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చర్యలు కూడా చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

Related Posts