- 'ఓరు అదార్ లవ్' ప్రపోజ్
- ఆమె కనుసైగలకు..అబ్బాయిలు ఫిదా!
- వాలెంటైన్స్ డే ఫీవర్
ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ నడుస్తోంది. ఓ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఎలా ప్రపోజ్ చేయాలి..? అని తికమకపడుతున్న ఈ సమయంలో... ఓ హైస్కూల్ అబ్బాయి-అమ్మాయి కళ్లతోనే ఐ లవ్ యూ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక ఈ అమ్మాయి చూపించే హావభావాలకు అబ్బాయిల మనసులు ఫుల్‌గా ఫిదా ఫు అయిపోతోంది.
ఈ వీడియో మళయాలంలోని 'ఓరు అదార్ లవ్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలోనిది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. మాటలు లేకుండా కేవలం హీరో హీరోయిన్ కనురెప్పలను ఎగరేయడం, కన్ను కొట్టుకోవడం వంటి హావభావాలతోనే లవ్ ప్రపోజ్ చేసుకుంటారు. క్లాస్ రూంలో జరిగే ఈ లవ్ ట్రాక్‌ని అద్భుతంగా చిత్రీకరించారు.
పదే పదే ఆ వీడియోను చూస్తూ... ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్‌నే అబ్బాయిలు వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టేసుకుంటున్నారు. ఒక్క రోజులోనే ఈ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది కూడా. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, పలు న్యూస్ పోర్టల్స్ అన్నింటిలోనూ ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి.