మళ్లీ ఆకాశ్ హీరోగా ఒక సినిమా చేయడానికి పూరి జగన్నాధ్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ హీరోగా చేసిన 'మెహబూబా' యూత్ నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయితే అంతటితో పూరి తన ప్రయత్నాలను మానుకోలేదు. ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితం కానుంది. అందువలన ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకి కథాకథనాలు పూరీనే సిద్ధం చేశాడు. అనిల్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.