YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీబీఐ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సీబీఐ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో పెను మార్పులు చోటుచేసుకున్న నేపద్యం లో అది చిలికి చిలికి గాలివానైన  వర్గపోరు సుప్రీంకోర్టుకు చేరిన  విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా మరో సీబీఐ అధికారి సుప్రీంను ఆశ్రయించారు. తనను నాగ్‌పూర్‌కు బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ మనీశ్ కుమార్‌ సిన్హా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వివాదాల కారణంగా సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ అస్థానాను కేంద్రం సెలవుపై పంపించింది. తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. కాగా.. బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే మన్నెం నాగేశ్వరరావు.. ప్రజాప్రయోజనం దృష్ట్యా సీబీఐలో 13 మంది అధికారులను తక్షణమే బదిలీ చేశారు. వీరిలో మనీశ్ కుమార్‌ సిన్హా కూడా ఉన్నారు.ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న బృందంలో ఒకరైన మనీశ్‌ను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీని సవాల్‌ చేస్తూ మనీశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ డెరెక్టర్‌ ఆలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణతో పాటే తన పిటిషన్‌పై కూడా రేపు అత్యవసరంగా విచారణ జరపాలని మనీశ్‌ కోర్టును కోరారు.అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై అంత అత్యవసరంగా విచారణ జరపాల్సింది ఏముంది అని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇందుకు మనీశ్‌ బదులిస్తూ.. ఆలోక్‌వర్మకు సంబంధించి షాకింగ్‌ డాక్యుమెంట్లు తనవద్ద ఉన్నాయని చెప్పారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. ‘మమ్మల్ని ఏదీ షాక్‌కు గురిచేయదు’ అని అన్నారు.

Related Posts