YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్'..!!

తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్'..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్' తెలుగులో భాషలోకి  అనువాదం అవుతుంది.. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో ' అంజలి విక్రమాదిత్య'  టైటిల్ ని ఖరారు చేసారు.. ఆర్. అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నా లు ప్రధానపాత్రలు పోస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధిపాత్రలో మెరవనున్నారు..  తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తారాగణం: నయనతార, అధర్వ, రాశి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ మరియు ఇతరులు

Related Posts