YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో మండలి ఫిర్యాదుల కమిటీ భేటీ

తిరుపతిలో మండలి ఫిర్యాదుల కమిటీ భేటీ
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి  ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్  రెడ్డి సుబ్రమణ్యం అధ్యక్షతన  కమిటీ సమావేశం  స్థానిక పద్మావతి అతిధి గృహం లో సోమవారం ఉదయం  జిల్లా లోని  ఫిర్యాదులపై సమీక్షించారు.  ఛైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా లో  కమిటీ వద్ద  3 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని సన్నిధి గొల్ల తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి,శెట్టిపల్లి, గొల్లపల్లి  భూములకు సంబంధించినవి వున్నాయని త్వరగా  పరిష్కరించాలని కోరారు. టిటిడి  జె ఇ ఓ  పోలా భాస్కర్ వివరిస్తూ సన్నిధి గొల్ల వారసత్వం పై నియామకానికి  ఇప్పటికే  బోర్డు సమావేశంలో వుంచి, ప్రభుత్వానికి పంపించడం జరిగిందని కమిటీకి  విన్నవించారు.  1987 లో ప్రభుత్వం   మీరాసీ  రద్దు  జి ఓ విడుదల చేసిందని  దానిని అమెండ్మెంట్  ప్రభుత్వ పరిధి లో వుందని తెలిపారు. శెట్టిపల్లి భూములపై కలెక్టర్ వివరిస్తూ పూర్తి స్థాయి లో  రిపోర్టు  సమర్పించామని,  చిన్న చిన్న సమస్యలు హౌసింగ్ ప్లాట్లు వున్న 3100 మంది వున్నారని అందులో 300 మందికి పైగా ప్లాట్లు లేవని రిజిస్ట్రేషన్ కాగితాలు వున్నాయని, కొంత చెరువు భూమి అక్రమణకు గురై  వెంచర్లు వేశారని,  వీటి పరిష్కారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సి సి ఎల్  తో  సమావేశమైతే  పూర్తి అవుతుందని   కమిటీకి వివరించారు.  ఈ నెల 28న కలెక్టర్  కాన్ఫరెన్స్ వుందని ప్రస్తావించడం జరుగుతుందని త్వరలో ఒక పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.   శ్రీకాళ హస్తి  నియోజకవర్గం కు  సంబంధించి గొల్లపల్లి, భూములు సర్వే పూర్తి చేశామని 95 % భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో వుందని అయినా  లబ్దిదారులు హై కోర్టుకు  వెళ్లారని యథాస్థితి పాటించాలని  కోర్టు ఉత్తర్వులు  ఇచ్చిందని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని  తెలిపారు. విషయం కోర్టు పరిధిలో ఉందని వివరించారు.   ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కమిటీ సహకారం తప్పక వుంటుందని  చైర్మన్ అన్నారు. ఈ సమావేశంలో  ఛైర్మన్  తో పాటు సభ్యులు,  జి. ప్రభాకర రెడ్డి,   ఎం.వి  సత్యనారాయణ ,  బి. అర్జునుడు, జె సి  పి ఎస్ గిరీషా ,  టి టి డి జె ఇ ఓ లు  పోలా భాస్కర్, శ్రీనివాసరాజు,  సబ్ కలెక్టర్  డా. మహేశ్ కుమార్, సి వి అండ్ ఎస్ ఓ  గోపీనాథ్ జెట్టి, టి టి డి ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డి,,  టి టి డి ఎస్టేట్ అధికారి గౌతమి,  ఫైనాన్షియల్ అద్వైజర్ బాలాజి, హిందూ ధర్మ ప్రచార పరిషద్  రమణ ప్రసాద్, డి ఎస్ ఓ జగన్నాథ సింగ్  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Related Posts