- జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్
- ఎలా బుక్ చేసుకోవాలి...
- మొబిక్విక్ కస్టమర్లు హోమ్ పేజీలో రీఛార్జ్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం ''రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్'' కేటగిరీలో ఉన్న ఫోన్ బుకింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
- ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మొబైల్ వాలెట్ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్ ప్రకటించింది. '' జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. నాలుగు సులభతరమైన స్టెప్స్‌తో యూజర్లు జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పలు గ్రేట్ ప్రయోజనాలను అందించనున్నాం'' అని మొబిక్విక్ బిజినెస్ హెడ్ బిక్రమ్ బిర్ సింగ్ తెలిపారు. దీంతో జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి ప్లాట్‌ఫామ్ తమదేనని మొబిక్విక్ పేర్కొంది. ఫోన్ నెంబర్ల ద్వారా కూడా జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
గతేడాది జూలైలో రిలయన్స్ ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్ మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ లైఫ్ ఆఫర్ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది. ఇందులో 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (128జిబిలకు పెంచుకోవచ్చు) ఉంది. 2.4 అంగుళాల స్ర్కీన్, 512 ఎంబీ ర్యామ్, వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరా, 2000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ముందు కెమెరా ఉండటం వల్ల వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ మాప్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ వంటి అప్లికేషన్లు కూడా ఉన్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. జియో అందిస్తున్న యాప్స్ అన్నీ ఇందులో ఉన్నాయి.