YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ తగ్గిన పెట్రోలు

 మళ్లీ తగ్గిన పెట్రోలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం (నవంబరు 19) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.76.52 కి చేరింది. డీజిల్ ధర 17 పైసలు తగ్గి రూ.71.39 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 19 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.82.04 కి చేరగా.. డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ. 74.79 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ ధర 67.39 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 57.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 21 పైసలు తగ్గి రూ.81.13 ఉండగా.. డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.77.67 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.80.54 ఉండగా.. డీజిల్‌ ధర రూ.79.69 వద్ద కొనసాగుతోంది. 

Related Posts