కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం ఉల్లి పాలెం లో విషాదం నెలకొంది. గ్రామంలో ఎ పి ఫైబర్ వర్క్ చేస్తున్న యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ నెల 21 వ తేదీన ఉల్లిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామదర్శిని కార్యక్రమం కి హజరుకానున్నారు. ముఖ్యమంత్రి గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇంటింటికి నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ఫైబర్ నెట్ తాలూకా వారు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరెంటు స్తంభం పై నుంచి పనులు చేస్తున్న ఇద్దరు ఫైబర్ నెట్ కేబుల్ కార్మికులు షాక్ తగిలి కింద పడిపోయారు. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరిని అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ లో క్షతగాత్రులను ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. గాయపడిన వారకి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారుల ను అయన అదేశించారు.