తాజాగా బాలీవుడ్ నటి ప్రీతి జింతా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఎప్పుడూ లైంగిక వేధింపులకు ఎదురుకాలేదని... ఎదురైతే బాగుండేదని, అందరికీ చక్కగా వివరించేదాన్నని తెలిపింది. ఎదుటివారు మనల్ని ఎలా చూడాలని అనుకుంటామో... వారు మనల్ని అలాగే చూస్తారని చెప్పింది. ఇవ్వాల్టి 'స్వీటూ'... రేపు 'మీటూ' అయ్యే అవకాశం ఉందని... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై చాలా మంది మండిపడుతున్నారు.