YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

జగిత్యాలలో నకిలీ పాస్‌బుక్‌ల దందా కలకలం

జగిత్యాలలో నకిలీ పాస్‌బుక్‌ల దందా కలకలం

- నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకు రుణాలు
- భూ రికార్డుల ప్రక్షాళనతో వెలుగు చూస్తున్న అక్రమాలు
- కొడిమ్యాలలో కేసు.. చేతులు మారుతున్న డబ్బు
రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టగా నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నకిలీ రికార్డులతో రిజిస్ర్టేషన్లు చేసుకోవడం, నకిలీ పాస్‌ పుస్తకాలు, 1బీలు, ఆన్‌లైన్‌ పహణీలు, టైటిల్‌ డీడ్‌లను రూపొందించి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 11న కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండగా నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేసిన అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. జిల్లాలోని కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులు ఓ ముఠాతో కలిసి వేలల్లోనే నకిలీ పుస్తకాలు తయారు చేసి రైతులకు అంటగట్టినట్లు ప్రచారం సాగుతోంది. కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసిన తర్వాత పాత పాసుపుస్తకాలు రద్దు కానున్నాయి. దొంగ పాసుబుక్కులతో రుణాలు పొందిన వారిలో ఆందోళన మొదలైంది.

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో నకిలీ పాస్‌బుక్‌ల దందా కలకలం రేపుతోంది. అధికారులతో కుమ్మక్కై ఓ ముఠా ఈ అక్రమం గా పాస్‌ పుస్తకాల తయారీకి తెర లేపింది. వేలల్లోనే నకిలీ పుస్తకాలు తయారు చేసి జిల్లాలో కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులు ఓ ముఠాతో కలిసి రైతులకు అంటగట్టి లక్షలాది రూపాయలు దండుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టగా, పాస్‌ పుస్తకాల అక్రమ వ్యవహారం రోజుకో చోట వెలుగు చూస్తోంది. నకిలీ రికార్డులతో రిజిస్ర్టేషన్లు చేసుకోవడం, నకిలీ పాస్‌ పుస్తకాలు, 1 బీలు, ఆన్‌లైన్‌ పహాణీలు, టైటిల్‌ డీడ్‌లను రూపొందించి బ్యాం కుల్లో రుణాలు తీసుకుంటూ జగిత్యాల జిల్లాలో కొందరు అక్రమాలకు తెర లేపారు. రాష్ట్ర ప్రభు త్వం మార్చి 11న కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండగా, నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేసిన అధికారుల్లో, పొందిన రైతుల్లో గుబులు మొదలైంది.

అధికారులే సూత్రధారులు..

రెవెన్యూ అధికారుల అండతో కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ పాస్‌ బుక్‌లను తయారు చేసి రైతులకు అంటగట్టారు. కరీంనగర్‌ సమీపంలోని రేకుర్తి సమీపంలోని మీ సేవ కేంద్రంలో నకిలీ పహాణీలను తయారు చేసి సిరిసిల్ల ప్రాంతంలో పాస్‌ బుక్‌లను ముద్రించి జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాలలో 33 మందికి నకిలీ పాస్‌ పుస్తకాలను అంటగట్టారు. నకిలీ పాస్‌ పుస్తకాలతో పాటు 1బి, ఆన్‌లైన్‌ పహణీ, టైటిల్‌ డీడ్‌, అధికారుల ముద్రలతో పక్కాగా పత్రాలు సృష్టించి కొడిమ్యాలలోని గ్రామీణ బ్యాంక్‌లో 33 మంది రైతులు దాదాపు రూ.29 లక్షల మేరకు రుణాలు పొం దారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పాస్‌ పుస్తకాలు నకిలీవని తేలడంతో ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంది. 33 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్లకు బై నెం బర్లు సృష్టించి, వాటికి పాస్‌ పుస్తకాలు తయారు చేసి టైటిల్‌ డీడ్స్‌, ఆన్‌లైన్‌ పహణీలు, 1 బిలను తయారు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ కేసును పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు ఓ పాత్రికేయుడు(ఆంధ్రజ్యోతి కాదు) ఓ వ్యక్తితో బేరసారమాడుతున్న ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. మేడిపల్లి మండలంలోని కొండాపూర్‌లో కూడా పెద్ద ఎత్తున నకిలీ పాస్‌ పుస్తకాలు బయట పడ్డాయి. కొండాపూర్‌కు చెందిన జక్కుల గంగరాజం భూమికి సంబంధించిన పత్రాలు సక్రమంగా లేకపోవడంతో తహసీల్దార్‌ గుర్తించి విచారణ జరిపారు. ఆయన పాస్‌ పుస్తకం నకిలీదని తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు గంగరాజంను అధికారులు ప్రశ్నించగా, భూమయ్య అనే వ్యక్తి అందించినట్లు తెలిపారు. భూమయ్య ఇంట్లో తనిఖీ చేయగా, నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో పాటు స్కానర్‌, అధికారుల ముద్రలు పెద్ద ఎత్తున లభించాయి. అలాగే పెగడపల్లి మండలం దోమలకుంటలో కూడా రిటైర్డ్‌ ఉద్యోగి కిషన్‌రావు వద్ద నకిలీ పాస్‌ పుస్తకాలు పట్టుబడ్డాయి. జగిత్యాల రూరల్‌ మండలంకు చెందిన 12 మంది జగిత్యాలలో నకిలీ పాస్‌ పుస్తకాలతో జగిత్యాలలోని బ్యాంక్‌లో రుణా లు తీసుకోగా, ఈ వ్యవహారం బయట పడగా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గొల్లపల్లి మండలం రాపల్లెలో కూడా పెద్ద ఎత్తున నకిలీ పాస్‌ పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున నకి లీ పాస్‌ పుస్తకాల దందా సాగింది. కొందరు రెవె న్యూ, బ్యాంక్‌ అధికారులతో కుమ్మక్కై ఓ ముఠా నకిలీ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌లను తయారు చేసి, రైతులకు అంటగట్టారు.

కొత్తపాస్‌ పుస్తకాలతో బయట పడనున్న దందా..జగిత్యాలతో పాటు కొడిమ్యాల, మేడిపల్లి, గొల్లపల్లి, సారంగాపూర్‌, పెగడపల్లి, మల్లాపూర్‌లలో కూడా వెలుగులోకి వస్తున్నాయి 

Related Posts