రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అన్ని వసతులతో సొంతఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయరావతి లో అయన అర్బన్ హౌసింగ్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాలలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ లాంటి ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, బ్యాంకు రుణం మౌలిక వసతుల ఏర్పాటు అన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చామని గుర్తు చేసారు. త్వరలోనే పట్టణాలలో లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశాలు జరుగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే, నెల రోజుల్లోపు చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తామని అయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి స్థలానికీ ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్ తీసుకువస్తున్నామని చంద్రబాబు వెల్లడంచారు. భూసేవలో భాగంగా రైతుల భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యురిటీ పాలసీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూసేవ ప్రారంభించామన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. భూముల క్రయవిక్రయాల్లో మోసాలు జరుగకుండా జాగ్రత్తగా భూధార్ అమలు చేస్తామన్నారు. వేలిముద్రల ఆధారంగానే భూ కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయన్నారు. త్వరలోనే గ్రామసభ లు నిర్వహించి ఎవరి పేరున ఉన్న భూములు వారికి అందజేస్తామని భూములు వారికి ఇప్పించడమే కాదు.. వారికి తానే ఫోన్ చేస్తానన్నారు. ఎవకికి ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా నేరుగా ప్రజలకు పట్టాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. సర్వే అండ్ సెటిల మెంట్ లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి, జియో రెఫరెన్స్ ఫిక్స్ చేస్తామన్నారు. భూసేవ ద్వారా రాష్ట్రంలోని ప్రతి స్థలానికి ఆధార్ తరహాలో సర్కార్ ప్రత్యేక నెంబర్ ఇవ్వనుంది. .