రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు. ఎక్కువగా జరుతున్న జిల్లాల్లో గుంటూరు నెంబర్ వన్ స్థానంలో ఉందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం నాడు అయన నరసరావుపేట వాసవి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ లైసెన్స్ నమోదు, ఏపీ స్కిల్స్ డెవలఫ్ సెంటర్ ఆధ్వర్యంలో కంప్యూటర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ యువత థ్రిల్ కోసం వేగంగా వెళితే కిల్ అవుతున్నారన్నారు. నేడు రాష్ట్రంలో , దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మద్యం సేవించి. వాహనాలు నడపడడం వలనే జరుగుతున్నాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకపాటించాలన్నారు. 29న నరసరావుపేట స్టేడియంలో డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోగా ఎల్ ఎల్ ఆర్ క్యాంపు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపు నందు అర్హత ఉండి 18సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికీ ఎల్ ఎల్ ఆర్, లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అమోరికా లాంటి దేశాలలో ప్రతి ఇంట్లో నాలుగు వాహనాలు ఉంటాయి. అలాగే మన దేశంలో సైతం ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ నీడ్ గా మారింది. వ్యాపారుల దగ్గర నుండి రైతుల వరకూ వెహికిల్ నీడ్ గా మారింది.. నిర్ణిత వేగానికి మించి వెళితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అలాంటి ప్రమాదం మా కుటుంబంలో జరిగింది. అది నా జీవితంలో చాల బాధ కలిగించిన పరిణామాలు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీటు బెల్టు తప్పసిరిగా వాడాలని అన్నారు.